ఎక్కడైనా వినియోగదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వినియోగదారుడు మోసపోయిన ప్రాంతానికే వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది.. కానీ, ఇప్పుడు ఎక్కడి…