ముందే ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యుడికి తీవ్ర భారంగా మారుతోంది. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ మళ్లీ పాల ధరలు పెంచేసింది. ఫుల్ క్రీమ్ లీటర్ పాలపై రూపాయి, టోకెన్ మిల్క్ లీటర్‌పై రూ.2 ధర పెంచుతున్నట్లు తెలిపింది.