తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, సినీ కళామతల్లి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటనా చాతుర్యం… అన్నీ కలసిన ఏకైక రూపం ‘ఎన్టీఆర్’. సినిమాల నుంచి రాజకీయాల వరకూ తనదైన ముద్ర వేసి, దశాబ్దాలుగా తెలుగు ప్రజల ప్రేమని పొందుతున్న మహనీయుడు ‘నందమూరి తారకరామారావు’. స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు వాడి పౌరుషానికి ప్రతీకగా కనిపించే ఎన్టీఆర్ కీర్తి ఎల్లలు లేనిది. అందుకే ఆయన శత జయంతి వేడుకల్లో భాగంగా…