నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల గుర్తింపును తెలంగాణ ఇంటర్ బోర్డు శాశ్వతంగా రద్దు చేసింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నార్సింగి దారి దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానిస్టేబుల్ రాజుపై దాడికి పాల్పడ్డ కరణ్ సింగ్‌పై నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రాజేంద్రనగర్ హైదర్ షా కోట్ కస్తూర్భా గాంధీ ఆశ్రమం నుండి 14 మంది మహిళలు పరారవడం సంచలనంగా మారింది. నిన్న అర్థరాత్రి 2 గంటల సమయంలో కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యారు మహిళలు. పేటా కేసులో మహిళలను ఆశ్రమానికి తరలించారు పోలీసులు. మహిళల పరారీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు చేసింది. అందులో ఉన్న 14…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న సమయంలో.. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కరోనా కలకలం సృష్టించింది.. ఒకే కాలేజీలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. భయభ్రాంతులకు గురయ్యారు తోటి విద్యార్థులు.. గత రెండు రోజులుగా తీవ్ర చలి, జ్వరంతో బాధపడుతున్నారు విద్యార్థులు… అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం.. ఇవాళ ఉదయం విద్యార్దులకు వైద్య పరీక్షలు చేయించారు.. అందులో భాగంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 25 మంది విద్యార్థులకు…
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం తప్పింది. విద్యానగర్ రైల్వే బ్రిడ్జి పై మద్యం మత్తులో దూసుకొచ్చిందో కారు. అదుపుతప్పి డివైడర్ ని ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలంలో వాహనదారుడికి బ్రీత్ ఎనాలసిస్ టెస్ట్ చేయగా 90శాతం ఆల్కహాల్ పర్సెంటేజ్ నమోదైంది. దీంతో వాహనదరుడి పై కేసు నమోదు చేసుకుని కారు సీజ్ చేశారు నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు. READ ALSO బంజారాహిల్స్‌లో…
వీఐపీలను నిలువునా ముంచేసిన శిల్ప చౌదరి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. శిల్ప ఆమె భర్త శ్రీనివాస్ పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నటుడు సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని, రోహిణి రెడ్డి. 2 కోట్ల 90 లక్షలు తీసుకొని మోసం చేశారని ప్రియదర్శిని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులు శిల్ప, శ్రీనివాస్ లు ఇద్దరిపై కోర్ట్ లో పీటీ వారెంట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు.…
కరోనా కారణంగా జీవనోపాధి కష్టం అవుతోంది. హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాల్ గూడలో విషాదం చోటుచేసుకుంది. మహ్మద్ అజాజ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాసిడ్ సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. కరోనా పుణ్యమాని ఎక్కడా కొలువు లేకపోవడంతో డిప్రెషన్ కు గురయ్యాడు. కుటుంబ పోషణ భారం కావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు యువకుడు. మహమ్మద్ అజాజ్ హుమాయూన్ నగర్ కు చెందిన వాడిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి…