తప్పతాగి రోడ్డెక్కడం.. రయ్య్‌మని దూసుకెళ్తూ అమాయకుల ప్రాణాలు బలితీసుకోవడం మందుబాబులకు అలవాటుగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్.. ఓవర్ స్పీడ్.. ర్యాష్ డ్రైవింగ్‌లకు పోలీసులు అడుగడుగునా చెక్‌పెడుతున్నా మందుబాబులు మాత్రం రెచ్చిపోతున్నారు. పట్టపగలే పీకలదాకా తాగి ర్యాష్ డ్రైవింగ్‌తో యాక్సిడెంట్‌లకు పాల్పడుతున్నారు. నార్సింగ్‌లో తాజాగా జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. పట్టపగలే మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ప్రమాదంలో ఓ మహిళ కొనప్రాణాలతో కొట్టిమిట్టాడుతోంది. నార్సింగ్ పరిధిలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం…