ఏపీలో టెన్త్ పరీక్షలు జరుగుతోన్న సమయంలో.. ప్రశ్నాపత్రాల లీక్ వార్తలు కలకలం రేపాయి.. వరుసగా ప్రతీ పరీక్షపై ఏదో ఒక లీక్ వార్త ఆందోళన కలిగించింది.. అయితే, టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్‌పై ఏపీ సర్కార్ కఠిన చర్యలు ప్రారంభించింది.. నారాయణ సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసింది.. ప్రశ్నపత్రాలను వాట్సాప్‌లో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది షేర్ చేసినట్టుగా గుర్తించామని చెబుతున్నారు పోలీసులు.. దీనిపై చిత్తూరు పోలీసులు నిశిత దర్యాప్తు చేపట్టారు..…
టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణను ఆయన సొంత వాహనంలోనే పోలీసులు ఏపీకి తరలించారు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధముందన్న ఏపీ పోలీసులు మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ టెన్త్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు సంచలనం కలిగించాయి. సీఎం జగన్ కూడా నారాయణ, చైతన్య సంస్థలపై తీవ్ర…
ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై చర్చించేందుకు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మంత్రి బొత్స కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అన్ని జిల్లాల్లో పోలీసులు విచారణ చేపట్టారని మంత్రి బొత్స వెల్లడించారు. టీడీపీ నేతలు రాజకీయంగా మాట్లాడుతున్నారని.. పేపర్ లీకేజీ జరగలేదని టీడీపీ వాళ్లు చెప్పగలరా…
మాజీ మంత్రి నారాయణపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో రాజధాని అమరావతికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు పెట్టామన్నారు. ల్యాండ్ పూలింగ్ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 14 మంది పేర్లను పోలీసులు చేర్చారు. సోమవారం నాడే సీఐడీ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ల్యాండ్ పూలింగ్…
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెన్త్ పరీక్షల సందర్భంగా రోజూ ఒకచోట పేపర్ లీక్ అంటూ వార్తలు రావడం… అవన్నీ ఫేక్ న్యూస్ అని.. జరిగింది మాల్ ప్రాక్టీసే అంటూ పోలీసులు స్పష్టం చేయడం తెలిసిన విషయమే. కానీ పేపర్ లీక్ జరిగింది నిజమే అని ప్రస్తుత పరిణామాల ద్వారా అర్థమవుతోంది. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్‌లు వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాట్సాప్ గ్రూప్‌లలో…
టెంత్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ కొండాపూర్‌లో అరెస్ట్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహాం రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నారాయణ అరెస్ట్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారు. మూడేళ్ల…
మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ పోలీసులు. కొండాపూర్‌లో నారాయణను అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ అధికారులు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధముందన్న ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు ఏపీలో సంచలనం కలిగించాయి. ఇటీవల సీఎం జగన్ కూడా నారాయణ, చైతన్య సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పలు అంశాలపై ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉందని…