మాజీ మంత్రి చేరిక.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోందా? ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కలవర పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? మోత్కుపల్లి చేరికతో.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..! మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత.. ఆ చేరిక ప్రకంపనలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నాయి. పైకి ఎవరూ చెప్పకపోయినా.. కొందరు ఎమ్మెల్యేలు తమకేమైనా గండం పొంచి…