India: పొరుగు దేశాలకు సహాయం చేయడంలో ఇండియా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవులు మాత్రమే కాకుండా సరిహద్దులకు దూరంగా ఉన్న టర్కీ, పాలస్తీనా వంటి దేశాలకు కూడా భారత్ సాయం చేసింది. సెప్టెంబర్ 1న, తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో అక్కడ సుమారుగా 1400 మందికి పైగా మరణించారు. ఈ దుఃఖ సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌కు నిజమైన స్నేహితుడిగా సాయం చేయడానికి భారత్ ముందుకు వచ్చింది.…