నంద్యాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. పట్ట లోని సలీమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఫరూక్ ఆటో డ్రైవర్ ఫరూక్.. రైల్వే స్టేషన్ లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. రైలు ప్లాట్‌ఫామ్ మీద ఆగడానికి వస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ ఫరూక్ పట్టాలపైకి దూకాడు. క్షణాల్లో రైలు అతనిపై నుంచి దూసుకెళ్లింది..
నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు.. 5వ లైన్‌పై రైలు నిలిచిపోయింది.. దీంతో.. పట్టాల పైనుంచి పక్కకు ఒరిగాయి చివరి 5 బోగీలు.. అయితే, రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..