ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని, నా భార్య శీలాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నారంటూ సభలోంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుపెట్టుకున్నారు. అప్పటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనజ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ నేతృత్వంలో…