‘అజరామరం’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన కొన్ని కళాఖండాలు ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ‘అజరామర చిత్రం’ అంటే 1963లో రూపొందిన ‘లవకుశ’ తరువాతే ఏదైనా అనేవారు ఎందరో ఉన్నారు. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా తెరకెక్కిన ‘లవకుశ’ 1963 మార్చి 29న విడుదలయింది. నభూతో నభవిష్యత్ అనదగ్గ విజయం సాధించింది. అరవై ఏళ్ళవుతూ ఉన్నా, ఆ సినిమాను అధిగమించిన మరో పౌరాణికం మనకు కానరాదు. అలాగే ఆ చిత్రం దక్షిణాదిన కోటి రూపాయలు వసూలు చేసిన…
మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను.. మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో…
తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో అన్నగా నందమూరి తారక రామారావు గారు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా రాజకీయ వేదిక అయినా కోట్లాది మంది ప్రజానీకం మనసులో యుగ పురుషుడుగా నిలిచారు నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు జాతిపై చేసిన సంతకం మరువలేనిది. ఈ ఏడాది మే 28 నుండి ఎన్టీర్ శత జయంతి…
తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తండ్రికి నివాళులు అర్పించారు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు తండ్రికి ఘన నివాళిగా బాలయ్య స్వయంగా పాడిన ‘శ్రీరామదండకం’ వీడియోను తాజాగా విడుదల చేశారు. యన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్రల బొమ్మలపై బాలయ్య గానం చేసిన’శ్రీరామదండకం’ గద్యం పాడారు. “సంపూర్ణ రామాయణం, లవకుశ, శ్రీకృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామపట్టాభిషేకం” చిత్రాలలోనూ “చరణదాసి,…