ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను విచారించేందుకు నాంపల్లి కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చింది. అయితే క్రిస్మస్ సెలవులు ఉన్నందున ఈ నెల 26, 27 తేదీల్లో నందు కుమార్‌ను చంచల్‌గూడ జైలులో విచారించనున్నారు.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. నంద కుమార్ కి TRS నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆయన బీజేపీకి ఎలాంటి సంబందం లేదని తేల్చిచెప్పారు.