ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో జరుగుతుందని కాంగ్రెస్, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈరోజు ప్రకటించాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
మహారాష్ట్రలో మహా అఘాడి సంకీర్ణ సర్కార్ లో లుకలుకలు మొదలయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీనేత నానా పటోలె పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నానని పటోలె పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ పోరాటాలను తమ పార్టీ సొంతంగా చేస్తుందని, ఒంటరిగా…