వ్యాపారం కోసం నానా తంటాలు పడాలి. మొన్నటికి మొన్న చెన్నైలో బిర్యానీ కొంటే టమోటాలు ఫ్రీగా ఇచ్చాడో వ్యాపారి. తాజాగా హైదరాబాద్ లో పర్యావరణ పరిరక్షణ, వ్యాపారం పెంచుకునేందుకు వినూత్నమయిన ఆఫర్ పెట్టాడో వ్యాపారి. న్యూ ఇయర్ సందర్భంగా మటన్ ప్రియులకు కొత్త ఆఫర్ ప్రకటించాడు ఓ మటన్ వ్యాపారి. ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు వినూత్నంగా టిఫిన్ బాక్స్‌లలో మటన్ పెట్టి అమ్ముతున్నాడు.
న్యూ ఇయర్ సందర్భంగా నల్గొండ జిల్లా చండూరులో భూతరాజు శ్రీకాంత్ అనే వ్యాపారి ఈ టిఫిన్ బాక్స్ ఆఫర్ పెట్టాడు. జనవరి1, 2 తేదీల్లో తన షాపునకు వచ్చే వినియోగదారుల కోసం మటన్ ప్రియులకు బంపర్ ఆఫరిచ్చాడు. కిలో మటన్‌కు ఓ టిఫిన్ బాక్స్ ఉచితంగా ఇస్తున్నాడు. ఈ ఆఫర్ రెండు రోజుల పాటు ఉండడంతో మటన్ ప్రియులు క్యూ కట్టారు. ఎంత ఆలస్యం అయినా మటన్, టిఫిన్ బాక్స్ తీసుకొని వెళుతూ కనిపించారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ కవర్ లను నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటున్నాడు వ్యాపారి భూతరాజు శ్రీకాంత్. బాక్సులు తెచ్చి మటన్ తీసుకెళ్ళాలని గతంలో ప్రచారం చేశాడీ వ్యాపారి. ఇప్పుడు తనే మటన్ బాక్సుల్లో పెట్టి మరీ అమ్ముతున్నాడు. దీంతో వినియోగదారులు మటన్ కొంటున్నారు. భలే వుంది కదా ఈ ఆఫర్.