ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబంపై వైసీపీ నేతలు పలు మార్లు దాడి చేశారని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలు చేపట్టింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. వెంకాయమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంపై పదేపదే దాడులు జరుగుతుంటే అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. బాధితురాలు వెంకాయమ్మతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు…