ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబంపై వైసీపీ నేతలు పలు మార్లు దాడి చేశారని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలు చేపట్టింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. వెంకాయమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంపై పదేపదే దాడులు జరుగుతుంటే అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. బాధితురాలు వెంకాయమ్మతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చారు.
కాగా ఎస్సీ మహిళ కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఈరోఉ ఛలో కంతేరుకు పిలుపునిచ్చారు. ఈ మేరకు టీడీపీ నేతలు కంతేరు వెళ్లేందుకు ప్రయత్నించగా పలుచోట్ల పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రకటించారు.
దళితులపై వైసీపీ దమనకాండ, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, దళిత మహిళ వెంకాయమ్మపై వైసీపీ మూకల దాడిని నిరసిస్తూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం ఛలో తాడికొండ నిర్వహిస్తున్నాం. – టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు#DalitLivesDontMatterInAP #DalitAtrocitiesInAP pic.twitter.com/lU9Gysnt4K
— Telugu Desam Party (@JaiTDP) June 12, 2022