USA Gun Shooting: అమెరికాలో ప్రవాస తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేశ్‌బాబును శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన రమేశ్ బాబు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు తెలిపారు.
చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశారని.. మరి ఆయన చేసిన ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందా సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన మార్క్ పథకం ఏదీ లేదని.. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్ను పోట్లు.. అబద్ధాలు.. కుట్రలు, కుతంత్రాలు అని విమర్శించారు. అందుకే నా అనేవాళ్ళు కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం పక్క రాష్ట్రంలో ఉన్నారన్నారు.
ఏపీలో ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా నాయుడుపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని సీఎం అన్నారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.సూళ్లూరుపేటలో టీడీపీ గాలి వీస్తోందన్న ఆయన.. జగన్‌కు ఓటు వేసినందుకు ఆయన ప్రజలను మోసగించారని విమర్శించారు.
GAS Pipeline Blast: తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని మేనకూరు పారిశ్రామికవాడ వద్ద గ్యాస్ పైప్‌లైన్ పేలుడు కలకలం సృష్టించింది.. గ్యాస్ పైప్‌లైన్ పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయోగాత్మకంగా ఇంటింటికి గ్యాస్ ను అందించేందుకు అదానీ కంపెనీకి చెందిన ఏజీ అండ్ పీ అనే కంపెనీ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టింది.. ఇక, ఇందులో భాగంగా ట్రయల్ పద్ధతిలో గాలిని పైపుల్లో నింపుతుండగా ఒత్తిడికి తట్టుకోలేని పైపులు ఒకసారిగా పగిలాయని చెబుతున్నారు.. దీంతో భారీ శబ్దం…