హీరోగా అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. మ్యూజికల్ గా ఆ సినిమాలు కాస్తంత గుర్తింపు తెచ్చినా కాసుల వర్షం కురిపించలేదు. ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్పైనే అఖిల్, అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైతం ఏజెంట్గా యాక్షన్, థ్రిల్లర్ మూవీతో అఖిల్ ను కొత్తగాచూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు మీద అఖిల్…