పవన్ వర్సెస్ పోసాని వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పోసాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగడం, ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం తప్పు అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. పైగా ఈ వివాదంలోకి ఆడవాళ్లను లాగడం దేనికని పవన్ అభిమానులతో నెటిజన్లు సైతం పోసానిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే జనసేన తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఒకవైపు…
పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, పోసాని చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ వివాదంపై స్పందించారు. ఇంస్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ’ సెషన్ నిర్వహించారు. అందులో భాగంగానే పోసాని వివాదం నుంచి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…
మెగా బ్రదర్ నాగబాబు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను తదుపరి రాష్ట్రపతిని చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసేవాడు కాదు.. దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. ఈమేరకు రాష్ట్రపతిగా రతన్‌టాటా పేరును సూచిస్తూ.. #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్ చేశారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే ఏడాది…
“మా” కాంట్రవర్సీ రోజురోజుకూ ముదురుతోంది. ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో 5 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్, స్టార్ హీరోలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న ‘మా’ ఎలక్షన్స్ పై మొదటిసారిగా స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని హితవు పలికారు. అలాగే లోకల్, నాన్ లోకల్…
టాలీవుడ్ లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత బండ్ల గణేష్ తో పాటు పలువురు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. అయితే.. తాజాగా ఈరోజు సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్.. ప్రకాష్ రాజ్ టీమ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘మా’ తరపున మేం చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెపుతునే వస్తున్నాం. అయినా కూడా నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో 28వ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్ బైక్‌పై బ్లాక్ షర్ట్ ధరించి, చేతిలో ఓ సూట్‌కేసు పట్టుకొని స్టైలీష్‌గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ పై మైత్రీ మూవీ మేకర్స్ లోగో కూడా…
కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. చాలామంది వైరస్ బారిన పడి కోలుకోగా, మరికొందరు కరోనావైరస్ తో యుద్ధం చేసి చివరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోవిడ్ కారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన మరొక వ్యక్తి మరణించాడు. కొన్ని చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పని చేసిన అంబటి రాజా కరోనా మహమ్మారితో పోరాడి కన్నుమూశారు. రాజా అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది.…
మే 24 ఇంటర్నేషనల్ బ్రదర్స్ డే. ఈ సందర్భంగా పలువురు తమ తమ బ్రదర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక సినీ ప్రముఖులు సైతం సోదరుల పట్ల ఉన్న ప్రేమ చాటుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే సందర్భంగా తన తమ్ముళ్ళతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ బ్లాక్…
స్టేజ్ మీద గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ అంటూ స్కిట్స్ చేసిన కుర్రాళ్లతో మెగాబ్రదర్ నాగబాబు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. బస్తీ బాయ్స్ అనేది టైటిల్. దీనికి ఆయనే కాన్సెప్ట్ అందించి ఇన్ఫినిటంతో కలిసి నిర్మిస్తున్నారు. ఓటీటీల్లో కాకుండా దీనిని నాగబాబు ఒరిజినల్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరం. బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ గురించి నాగబాబు మాట్లాడుతూ సద్దాం-యాదమ్మ రాజు-భాస్కర్ - హరి (అదిరింది టీమ్) కలిస్తే కామెడీ బావుంటుందని ఆ నలుగురితో బస్తీ…