2025 తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిందని హీరో నాగ చైతన్య అన్నారు. ‘తండేల్’ సినిమా తన సినీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పారు. తన కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తన తొలి చిత్రంగా తండేల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. కొత్త ఏడాదిలో తన లైఫ్‌లో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు జరగనున్నాయన్నారు. నటుడిగా కొత్త కథలను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కథల ఎంపిక విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటానని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ‘2025…