మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజే రక్షా బంధన్ కూడా కలిసిరావడంతో మెగా కుటుంబంలో సంబరాలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్, సినీ ప్రముఖుల విషెస్ తో పాటుగా చిరు సినిమాల ప్రకటనలతో ఈసారి కూడా ఆయన బర్త్ డే వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. తాజాగా మెగా బ్రదర్స్ ఒకే చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షా బంధన్ ను పురస్కరించుకొని సిస్టర్స్ తో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు నాగబాబు, పవన్ కళ్యాణ్..…
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ‘మా’ శాశ్వత భవనం లేదంటూ బాలయ్య ఇటీవలే వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు.. ‘మా’కు శాశ్వత భవనం…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ – ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీకి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడనున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగబాబు, బండ్ల గణేష్, శ్రీకాంత్, ఉత్తేజ్, సమీర్, సన, బెనర్జీ, నాగినీడు అనసూయ ఏడిద శ్రీరామ్, ప్రగతి, తనీష్ అజెయ్ తదితరులు హాజరయ్యారు.…