Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే సొంత పార్టీని కూడా అనౌన్స్ చేసిన విజయ్.. ప్రచారాలు కూడా మొదలుపెట్టాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగపడే పనులు చేసి తమిళనాడులో మంచి పేరును తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా విజయ్.. నడిఘర్ సంఘానికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు.
గత కొన్నాళ్లుగా నటి అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాఠీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో అభినయ పాల్గొన్నది. ఈ వేడుకకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో అభినయతో పెళ్లి వార్తలపై విశాల్ క్లారిటీ ఇచ్చాడు.
స్టార్ హీరోలు విశాల్, కార్తీలకు హత్యా బెదిరింపులు రావడం కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. విశాల్, కార్తీలను చంపేస్తామని కోలీవుడ్ సహాయ నటుడు రాజదురై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నడిఘర్ సంఘం అధికారి ధర్మరాజ్ తేనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.