Kollywood: హీరో విశాల్, కార్తీలను చంపుతామని బెదిరింపులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోలు విశాల్, కార్తీలకు హత్యా బెదిరింపులు రావడం కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. విశాల్, కార్తీలను చంపేస్తామని కోలీవుడ్ సహాయ నటుడు రాజదురై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నడిఘర్ సంఘం అధికారి ధర్మరాజ్ తేనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నడిఘర్ సంఘం అధ్యక్ష్యుడు నాజర్ నేతృత్వంలో సంఘ సభ్యులు కార్తీ, విశాల్.. సంఘం కోసం పోరాడుతున్నారని తెలిసిన విషయమే.. సినీ కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఈ సంఘం తరుపున విశాల్, కార్తీ ముందు ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారిపై అక్కసు పెంచుకున్న సహాయ నటుడు రాజదురై వారిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, వారిని చంపేస్తామని బెదిరిస్తున్నాడని ధర్మరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసి పలువురును రెచ్చగొడుతున్నాడని తెలిపారు. అతడిపై కఠిన చర్యలు తీసుకొని విశాల్, కార్తీకి ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరారు. ఇక ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక విశాల్, కార్తీల కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం విశాల్ లాఠీ సినిమాలో నటిస్తున్నాడు.. ఇటీవలే ఈ షూటింగ్ లో గాయాలపాలైన విశాల్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. మరోపక్క కార్తీ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక హీరోలకు చావు బెదిరింపులు రావడంతో వారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Also Read
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Kayadu Lohar: "రాయితో కొట్టి తల పగలగొట్టా".. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
తాజావార్తలు
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్‌తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్‌ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!