చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేసి ప్రచారం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు మాత్రం రక్షణ ఇవ్వలేకపోతోంది.రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళా వలస కూలీపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరం అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. పొట్ట కూటి కోసం వలస వచ్చిన కుటుంబానికి ఎదురైన ఈ దిగ్భ్రాంతికర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితిని తెలియచేస్తోందని ఎద్దేవా చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి…