Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కేంద్రంగా మారింది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దేశంలోని అన్ని ప్రాంతాల్లో వైద్యులు తీవ్ర నిరసన తెలియజేశారు.
సీఎం మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌లకు సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పోలీసు కమిషనర్ మొదట చెప్పారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.