మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులను చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి, అఖిల్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన మైత్రి వారు ఇప్పుడు మెగా హీరోతో మరో ప్రాజెక్టుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్తో మైత్రి మూవీ మేకర్స్ రెండు ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ ‘ఉప్పెన’ను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్.…