ప్రస్తుతమున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఇతనికి.. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇంతవరకూ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ పడకపోయినా, యువతలో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. నటుడిగానూ తన సత్తా చాటుకోవడంతో, ఇండస్ట్రీలోనూ మంచి డిమాండ్ వచ్చిపడింది. అందుకే, జయాపజయాలతో సంబంధం లేకుండా ఫిల్మ్‌మేకర్స్ ఇతనితో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇతను మరో రమేశ్ కడూరి అనే మరో కొత్త దర్శకుడితో చేతులు కలిపాడు.
కిరణ్ అబ్బవరం పుట్టినరోజుని పురస్కరించుకొని.. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ‘మీటర్’ అనే టైటిల్ ఖరారు చేయగా, పోస్టర్‌లో మాస్ లుక్‌లో కిరణ్ అదరహో అనిపించాడు. మీటర్ టైటిల్ పైన మనం ఒక స్పీడోమీటర్‌తో పాటు మూడు సింహాల చిహ్నాన్ని కూడా గమనించవచ్చు. ఈ చిత్రానికి మెజర్ ఆఫ్ ప్యాషన్ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ఈ సినిమాని క్లాప్ ఎంటర్టైన్‌మెంట్ & మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే.. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.
ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న రమేశ్ కడూరి.. ఇదివవరకు కేఎస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఇప్పుడు ఈ మీటర్ చిత్రంతో దర్శకుడితో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటివరకూ సెటిల్డ్ పాత్రల్లో కనిపించిన కిరణ్.. ఇందులో మాస్ అవతారంలో అలరించబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీత దర్శకుడు.