కేవలం మూడే మూడు డైలాగ్స్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే.. నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలీదు నా కోడకల్లార్రా.. ప్రస్తుతం ఈ డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జూన్ పదో తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. బాలయ్య 107వ సినిమా నుంచి ఫస్ట్ హంట్ టీజర్ రిలీజ్ చేశారు. దాంతో నందమూరి అభిమానులకు ఒక రోజు ముందుగానే పండుగ వాతావరణం తీసుకువచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పించేలా.. యాక్షన్ ఎపిసోడ్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్, పొలిటికల్ సెటైర్లు, బాలయ్య స్టైల్ ఆఫ్ మేనరిజమ్‌తో అదరహో అనేలా ఉంది. ఇందులో బాలయ్య బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ లో అదిరిపోయే అవుట్ ఫిట్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. 15 గంటల్లో 3.6 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా.. 2.7 లక్షలు కి పైగా లైక్స్ ని అందుకుంది.
ఇక అఖండతో థియేటర్ బాక్సులు బద్దలు చేసిన సంగీత దర్శకుడు తమన్.. మరోసారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడని చెప్పొచ్చు. అఖండ తర్వాత అదే ఊపులో వస్తున్న సినిమా కావడంతో.. 107 ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. టీజర్‌తో పాటు టైటిల్ కూడా ప్రకటిస్తారని ఎదురు చూశారు అభిమానులు. అంతేకాదు రెడ్డిగారు, జై బలయ్య.. అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ చివరకి టైటిల్ లేకుండానే టీజర్ రిలీజ్ చేయడంతో.. బాలయ్య ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే అఖండ విషయంలో కూడా ఇలాగే ఫస్ట్ రోర్ అంటూ టీజర్ రిలీజ్ చేశారు. అదే సెంటిమెంట్‌ను ఇప్పుడు ఫాలో అయ్యారని చెప్పొచ్చు. ఇక మేకర్స్ మరో సరికొత్త పోస్టర్ తో బాలయ్యకి బర్త్ డే విషెష్ తెలిపారు. ఏదేమైనా.. బాలయ్య హంట్ సాలిడ్‌గా ఉందని చెప్పొచ్చు.