మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలని సమన్లలో పేర్కొంది. దీంతో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కు సంబంధించిన కేసులో ముఖ్యమంత్రిని లోకాయుక్త ప్రశ్నించనుంది.
కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కలకలం సృష్టిస్తోంది. ముడా నుంచి భూమి కేటాయింపులో జరిగిన కుంభకోణంపై ఫిర్యాదులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి కర్ణాటక గవర్నర్ శనివారం అనుమతి ఇచ్చారు. 'ముడా కుంభకోణం'పై ధ్వజమెత్తిన ఆర్టీఐ కార్యకర్త టీజే అబ్రహాంను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్‌భవన్‌లో కలవాలని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశించారు.