ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాలకంటే ఘోరంగా తయారయ్యారట. కార్యక్రమం ఏదైనా సరే… కుమ్ముడు కామనైపోయింది. చివరికి ఆ గొడవలు చూసి… ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సైతం టూర్‌కి రావడానికి జంకుతున్నారట. కమాన్… నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకుందాం అంటూ కాలు దువ్వుతున్న ఆ కాంగ్రెస్ నేతలు ఏ జిల్లాలో ఉన్నారు? ఎందుకు అక్కడ అలాంటి పరిస్థితులున్నాయి? సిద్దిపేట జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. గ్రూపుల గోల, కలహాల కాపురం, ఆధిపత్య…