నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని, పెద్ద ఎత్తున పేదలకు జకాత్, ఫిత్రా పేరుతో దానధర్మాలు చేస్తారని గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని…
నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని వైశ్య బజార్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే జామియా మసీదులో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇమామ్ సాబ్ కాకర్ల సురేష్ చేత ప్రార్థనలు జరిపించారు. అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా కాకర్ల సురేష్ ఉండాలని ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ముస్లిం సోదరులను పరిచయం చేసుకున్నారు. వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.