తెలుగు సినిమా రంగంలో ఎందరో సంగీత దర్శకులున్నా, సినీజనం మాత్రం దేవిశ్రీ ప్రసాద్, థమన్ వెంటే పరుగులు తీస్తున్నారు. దాంతో ఒక్కో సినిమాకు వారు రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. టాప్ స్టార్స్ లో అధిక శాతం వీరిద్దరి వెంటే పడుతూ ఉండడంతో, వైవిధ్యం కూడా కొరవడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైవిధ్యం కోసం ఎ.ఆర్.రహమాన్ వైపు మన తెలుగువారి చూపు సాగుతోందని వినికిడి. నిజానికి ఎ.ఆర్.రహమాన్ తొలి రోజుల్లో…