తెలంగాణలో సంచలనం కలిగించిన సస్పెండైన హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం రామకృష్ణ అదృశ్యమయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమైన లతీఫ్ అనే వ్యక్తి రామకృష్ణను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడని అతని భార్య భార్గవి తెలిపింది. అయితే రామకృష్ణ హత్యకు గురయిన సంగతి తనకు ఆలస్యంగా తెలిసిందని, పోలీసులు ఏం మాట్లాడడడం లేదని పేర్కొంది. రామకృష్ణ డెడ్ బాడీ సిద్దిపేట జిల్లాలో లభ్యం అయింది. తన తండ్రి వెంకటేశే.. రామకృష్ణను హత్య…
పంజాబ్‌లోని జలంధర్‌లో దారుణం జరిగింది. కబడ్డీ ప్రపంచంలో ఛాంపియన్‌గా నిలిచిన అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు, ఇండియన్ స్టార్ సందీప్ నంగల్ సోమవారం దారుణహత్యకు గురయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సందీప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఈ హత్యకు గల కారణాలపై జలంధర్ పోలీసులు విచారణ చేపట్టారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానం…
తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన ఓ చెల్లెలు దారుణ హత్యకు గురైంది. కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన కొవ్వాసి నంద చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో తన అక్క దగ్గర నివసిస్తోంది. ఇటీవల అన్నను చూసేందుకు కన్నాపురం గ్రామానికి వచ్చింది. అయితే కొవ్వాసి నంద భార్య రెండు రోజుల క్రితం పుట్టింటికి…
సినిమాలు కొంతమందిపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అందులోనూ క్రైం కథాంశంతో వచ్చిన సినిమాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనంతపురం జిల్లాలో ఓ కేసులో నేరగాడికి దండుపాళ్యం మూవీ ప్రేరణ అయింది. కదిరి దోపిడీ హత్యకేసులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. సినిమా చూసి హత్యతో పాటు దోపిడీ చేశాడు మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు. దండుపాళ్యం సినిమా చూసిన తరువాత.. పక్కా పథకంతో హత్య, దోపిడీ చేశాడు. సంచలనం రేకెత్తించిన ఉపాధ్యాయురాలి హత్య కేసు ఛేదించారు పోలీసులు.…
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో పాపులర్ డైలాగ్ మీకు గుర్తుందా? మొక్కే కదా పీకితే పీకకోస్తా అంటాడు చిరంజీవి. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో తాజాగా చోటుచేసుకుంది. తన పొలంలోని మొక్కను పీకినందుకు 7 ఏళ్ల బాలుడిని 12 ఏళ్ల బాలుడు చంపేశాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా షేక్‌పూర్ గ్రామంలో జనవరి 26న 12 ఏళ్ల బాలుడు తన పొలాన్ని పర్యవేక్షిస్తుండగా అదే గ్రామానికి…
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నేరాలు ఘోరాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా శేరిలింగంపల్లి సమీపంలోని తెల్లాపూర్ లో దారుణం జరిగింది. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి కనపడకుండా పోయిన కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు. రియల్ ఎస్టేట్ లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత ఘర్షణల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు కడవత్ రాజు బంధువుల్ని…
కర్నూలు జిల్లాలోని డోన్ రైల్వేస్టేషన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ లో అల్లరి మూకల వ్యక్తులు అరాచకం సృష్టించారు. రాత్రి నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూకలు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న భర్తపై దాడి చేసి మరో మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూక ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేసి గొడవ చేయడంతో.. మహిళ కొడుకును ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో మెట్టుకు మహిళ తల తగిలి మృతి చెందడంతో……
నవమాసాలు మోసి కన్న తల్లినే కొడుకు కడతేర్చిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఎక్సర్ సైజ్ చేస్తుండగా తల్లి మందలించింది. దీంతో సైకో కొడుకు సుధీర్ రాడ్ తో తల్లిని తలపై కొట్టాడు. అంతేకాకుండా అడ్డు వచ్చిన చెల్లెను సుధీర్ కూడా రాడ్ తో కొట్టాడు. అయితే ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న సుల్తాన్…
మిత్రుల మద్య పాత విభేదలతో మాట్లాడుతున్నట్టే నటించి ఓక్క సారిగా కత్తి తో పోడిచి..అతను కాపాడండి ఆర్ధనదలు చేస్తుంటే…కత్తుల పట్టుకోని నడి రోడ్డు పై నృత్యలు చేశారు.. పోడిచి దర్జగా రోడ్డు పై కూర్చోని కత్తుల తీప్పుతు ఏంజాయ్ చేశారు..సికింద్రాబాద్ బేగంపేట లో జరిగిన హత్యయత్నం కేసులో సీసీ వీడియోలు చుస్తే షాక్ అవ్వాల్సిందే.. బేగంపేట రసూల్ పుర కు చేందిన ప్రదీప్, మునీర్ పాత మిత్రులు.. ఇద్దరి మధ్న గత కొద్ది కాలంగా విభేదాల కారణంగా…
నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని అమ్మటివారి పాలెంలో జరిగిన జంట హత్యల కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. తల్లి షేక్ మీరా, కొడుకు షేక్ అలిఫ్ లని మండలంలోని పొలంపాడు గ్రామానికి చెందిన రబ్బానీ హత్య చేసినట్లుగా కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. ఒకే రోజు ముగ్గురి హత్యకు నిందితుడు రబ్బానీ ప్రణాళికల రూపొందించినట్లు కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. కలిగిరిలో షేక్ మీరా, ఆమె కుమారుడు షేక్ అలిఫ్ ను హతమార్చిన…