ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాలను గుర్తుచేసుకుంటూ తిరుపతికి చెందిన సూక్ష్మ కళాకారుడు పల్లి చిరంజీవి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమతో చిత్రాన్ని గీశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో తిరుపతి నుంచి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా గ్రామానికి వెళ్లి.. తిరుచానూరు అమ్మవారి కుంకుమతో వేసిన చిత్రపటాన్ని వీరజవాన్ కుటుంబసభ్యులకు అందజేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీపై అభిమానంతో ఒక చిత్రకారుడుగా తన…
సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కాసేపటికి క్రితం ముగిశాయి. అగ్నివీరుడు మురళీ భౌతికకాయానికి స్వగ్రామం కళ్లితండాలో అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. వీరజవాన్‌ను కడసారి చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు భారీగా తరలివచ్చారు. మంత్రి నారా లోకేశ్ మురళీ శవపేటికను మోశారు. అంతకుముందు మురళీ తల్లిదండ్రులను లోకేశ్ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఓదార్చారు. Also Read: IND…
భారత్-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ భౌతికకాయం సొంతూరికి చేరింది. భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు అతడి ఇంటికి చేర్చారు. మురళీ భౌతికకాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డంతాండ పంచాయతీ కల్లితాండాకు ఆర్మీ అధికారులు తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహం చూసి మురళీ తల్లిదండ్రులు బోరున ఏడుస్తున్నారు. మురళీ భౌతికకాయంను చూసేందుకు స్థానికులు భారీగా వచ్చారు. జవాన్ మురళీ నాయక్‌ను కడసారి చూడటానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. చేతిలో మువ్వన్నెల జెండా పట్టుకుని ‘భారత…