తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. ఏం ఘనకార్యం చేశావని దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావ్ అంటూ ఆయన ప్రశ్నించారు.
మునుగోడు ఉపఎన్నిక కోసం రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. విజయమే లక్ష్యం కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
దేశ వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామని స్పష్టం చేశారు నారాయణ.. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్లు చేశారు.. ఇక్కడ కాంగ్రెస్ కొంప సరిగా లేదని తేల్చేశారు..