ఆదిమూలపు సురేష్. ఏపీ మంత్రివర్గంలో రెండోసారి చోటు దక్కించుకున్న ఆయన ప్రస్తుతం మునిసిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే వైసీపీ కార్యకర్తలు మంత్రికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో కొందరికే ప్రాధాన్యం ఇవ్వటంతో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆయన తొలిసారి మంత్రి అయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుల్లలచెరువు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…