స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పురపాలికలు మేయర్లు,చైర్పర్సన్, కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాలు, పల్లెల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో…