స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కేసు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలే కునాల్ కుమ్రాను ఇరకాటంలో పడేశాయి. ఆయనపై మహారాష్ట్రలోని పలు స్టేషన్లలో శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇక కునాల్‌పై నమోదైన కేసుల్లో భాగంగా ఆయనకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.