ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 16 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమక్క-సారక్క జాతర గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అయితే ఇలా మేడారం జాతరకు బయలుదేరిన ఓ కుటుంబ ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. ఎంతో ఆనందంగా అమ్మవార్ల దర్శనం కోసం ఇంటి నుంచి మేడారంకు కారులో ఓ కుటుంబం బయలు దేరింది. అయితే ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును కారు…