Rahul Gandhi: గురువారం నాడు పార్లమెంట్‌లో చోటుచేసుకున్న సంఘటనలో గాయపడ్డ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజపుత్‌లను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బండి సంజయ్ పరామర్శించారు. పార్లమెంట్‌లో జరిగిన తోపులాటలో ఇద్దరు ఎంపీలు గాయపడటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వరుస ఓటముల కారణంగా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరిగిందని…