క్రాంతి..... వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతిచ్చి... ఎలక్షన్ తర్వాత పార్టీలో చేరారామె. ఇప్పుడిక డైరెక్ట్‌గా తండ్రి, తమ్ముడు గిరి టార్గెట్‌గా పొలిటికల్ కామెంట్స్ చేయడం సంచలనం అవుతోంది. ఆమె పొలిటికల్ మూవ్‌మెంట్స్‌పై రకరకాల విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు ముద్రగడ గిరి. అటు పద్మనాభం కొడుకుని సపోర్ట్ చేస్తూ... నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తొలి వీడియోలో తన తండ్రి ఛాలెంజ్‌ను తప్పుబట్టిన ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టంగా పేర్కొన్న ఆమె.. పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి అధికారం లేకపోయినా సమస్యల పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు.. అటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో…