Inspiration in Eye Donation: తెలంగాణలో అదో చిన్న విలీన గ్రామం. హన్మకొండ జిల్లాలోని హసంపర్తి మండలంలో మారుమూలన ఉంది. అయితేనేం ఆ ఊరి ప్రజల మనసు మాత్రం ఎంతో విశాలం. గ్రామంలో ఎవరు చనిపోయినా వారి కుటుంబ సభ్యులు మృతుల కళ్ళను దానం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే గ్రామంలో 52 మందికి పైగా నేత్రాలను దానం చేశారు. ఎంతోమంది జీవితాల్లో ముచ్చర్ల గ్రామం వెలుగులు నింపుతోంది. ముచ్చర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఇంజనీర్ మండల రవీందర్…