తమిళ సంగీతదర్శకులు తెలుగువారిని విశేషంగా అలరించారు. వారిలో ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్థానం ప్రత్యేకమైనది. నటనలో రాణించాలని సినిమా రంగంలో అడుగుపెట్టిన ఎమ్.ఎస్.విశ్వనాథన్ కు చిన్నతనంలో నేర్చిన సంగీతమే అన్నం పెట్టింది. ఆ తరువాత విశ్వనాథన్ స్వరకల్పన సంగీతప్రియులను విశేషంగా అలరించింది. మిత్రుడు రామ్మూర్తితో కలసి బాణీలు కట్టినా, సోలోగా సంగీతం సమకూర్చినా ఎమ్మెస్ విశ్వనాథన్ స్వరకల్పనలో ప్రత్యేకతను చాటుకున్నారు. మెలోడీ కింగ్ గా పేరొందిన ఎమ్మెస్ విశ్వనాథన్ ను తమిళులు అభిమానంతో ‘మెల్లిసై మన్నార్’ అని పిలుచుకుంటారు. ఎమ్మెస్వీని…