ప్రజాప్రతినిధులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం 10 వేల రూపాయల నుంచి 13 వేల రూపాయలకు పెరిగింది.. అలాగే ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6500కు పెంచుతూ పంచాతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, ప్రభుత్వ…
పరిషత్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పర్వాలేదు అనే స్థాయిలో స్థానాలను కైవసం చేసుకుంది.. రాజమండ్రి ఎంపీ భరత్ దత్తత గ్రామంలోనూ సత్తాచాటిన జనసేన విజయం సాధించింది.. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ కౌంటర్ ఇచ్చారు ఎంపీ భరత్.. నా దత్తత గ్రామం పొట్టిలంకలో ఎంపీటీసీ ఓటమిపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికావన్న ఆయన.. దత్తత తీసుకుంటే ఖచ్చితంగా గెలవాలని ఎలా చెప్పగలం.. అని ప్రశ్నించారు.. ఇక, జనసేన ప్రభావం ఆ గ్రామంలో…
అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఇతర నేతలపై ఒంటికాలితో లేచే మంత్రి కొడాలి నాని.. మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశిస్తూ.. తుప్పు, పప్పు అంటూ ఫైర్ అయ్యారు.. పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు అంటున్నారు.. మరి.. టీడీపీ నుంచి గెలిచినవాళ్లంతా.. పార్టీ ఆదేశాలను ధిక్కరించినవాళ్లా? అని ప్రశ్నించారు.. సీఎం జగన్‌ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్న కొడాలి నాని.. పరిషత్ ఎన్నికల్లో…
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిషికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎంపీపీ ఎన్నిక 24వ తేదీన జరగనుండగా.. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు 25వ తేదీన జరగనున్నాయి.. అయితే, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… క్లీన్‌స్వీప్ చేసింది.. అన్ని జడ్పీ చైర్మన్ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.. ఇదే ఊపులో జడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది.. వైసీపీ…
ఆంధ్రప్రదేశ్‌లో వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చితికిలపడిపోయింది.. ఇక, ఈ ఎన్నికలతో టీడీపీ పని అయిపోయిందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎన్నికల ఫలితాలు లెక్కించాలని తీర్పు ఇచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆక్రోశం, ఆందోళన మొదలైందని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రజలు సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందనన్నారు.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయింది.. టీడీపీకి ప్రజల్లో మనుగడ…
ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అఖండమైన విజయం సాధించింది. ఈ విజయం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ విజయం తన బాధ్యతను మరింత పెరిగిందని, గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు రుణపడి ఉంటానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి ఇప్పుడు జరిగిన పరిషత్ ఎన్నికల వరకూ అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం,…
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు సంబందించిన పూర్తి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉండటం విశేషం. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ దూసుకుపోయింది. భారీ విజయాలు నమోదు చేసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార వైసీపీ 5998 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 826 చోట్ల, జనసేన 177 చోట్ల, బీజేపీ 28, సీపీఎం15, సీపీఐ 8, ఇతరులు 157 స్థానాల్లో విజయం సాధించారు. ఇండిపెండెంట్లు ఎక్కువ స్థానాలు…
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. రాత్రి నాటికి పూర్తి జిల్లా పరిషత్ ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్లో కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని గిరిజా శంకర్ వెల్లడించారు. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎంపీటీసీ…
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబందించిన ఫలితాలు వెటువడుతున్నాయి. ఎంపీటీసీ ఫలితాల్లో దూసుకుపోతున్న వైసీపీ ఇప్పుడు జెడ్పీటీసి ఫలితాల్లో కూడా మెరుగైన స్థానాలు సొంతం చేసుకున్నది. మొత్తం 642 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అందులో 152 స్థానలకు సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ 152 స్థానాల్లో అధికార వైసీపీ సొంతం చేసుకున్నది. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు 3,985 ఎంపీటీసీ స్థానాలకు సంబందించిన ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైసీపీ 3585 స్థానాల్లో విజయం సాధించగా,…