Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడుపడని కొయ్యగా తయారైంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు, మరో అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఇంచార్జ్ దొరకడం లేదు. అభ్యర్థుల కసరత్తు, రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్.. చివరినిమిషంలో సీటు దక్కగా వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.
Raja Singh: పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా అని తన మనసులోని మాటను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బయట పెట్టారు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో సీఎం స్పష్టం చేయాలన్నారు.
కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలన కామెంట్లకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ తన జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానన్నారు. పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి…
ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసీపీ తరఫున మరోసారి అవకాశం దక్కించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నాలుగు స్థానాల్లో విజయసాయిరెడ్డితో పాటు నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులను జగన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీవీతో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నా పై అచంచల విశ్వాసం ఉంచి రాజ్యసభకు మరోసారి పంపిస్తున్న ముఖ్యమంత్రి దంపతులు జగన్, భారతి లకు ధన్యవాదాలు తెలిపారు. నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా…
తెలంగాణ అంతటా ఒకతీరు… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకతీరు. ఖమ్మం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి. గతంలో ఎంపీగా పనిచేసిన ఆయన గత కొంతకాలంగా స్తబ్ధంగా వున్నారు. మళ్లీ తాజాగా ఆయన పేరు బాగా వినిపిస్తోంది. ఆయనను గులాబీ అధినేత పెద్దల సభకు పంపుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీఎంవో నుంచి కాల్ వచ్చిందని పదవి ఇస్తామని చెప్పినట్లుగా .. ఇక నామినేషన్ వేయడమే తరువాయి అని అంటున్నారు. నామినేషన్ తేదీ.. నామినేషన్…