కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్లలో ఎంపీ కోటాను పునరుద్దరించే ప్రతి పాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి రాజ్యసభలో కేంద్రం సోమవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చింది.
కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోట ఎత్తివేస్తూ నిర్ణయం వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎంపీ కోటా సీట్లు ఉండవని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్ కి ఆదేశాలు అందాయి. ఈ నిర్ణయంపై ఎంపీలు, విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రీయ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. కేంద్రమంత్రి లెక్కల ప్రకారం గత ఏడేళ్ళలో 12 లక్షలమంది విద్యార్ధులు ప్రవేశాలు పొందారు. గత…