భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఆమె ఆరోగ్యంపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు గుప్పిస్తోంది. అనారోగ్యం కారణంగా మాలెగావ్ పేలుళ్ల విచారణకు హాజరుకాలేనని చెబుతున్న ఆమె.. పెళ్లి వేడుకలో డ్యాన్సులు చేయడంపై మండిపడుతున్నారు. అయితే, ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. ఇద్దరు పేదింటి యువతులకు తన ఇంట్లోనే వివాహం జరిపించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఎంపీ కూడా డ్యాన్స్ చేశారు. ఈ…
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ రాగా.. మృతుల సంఖ్య భారీగానే ఉంది. ఈ సమయంలో.. బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి… వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్లు ఏమీ అక్కర లేదు.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు గోమూత్రం తాగితే చాలని ఆమె సెలవిచ్చారు.. అది కూడా దేశీ గోమూత్రం అయితేనే ఫలితం ఉంటుందని చెప్పుకొచ్చారు.. అంతేకాదు.. తాను రోజూ గోమూత్రం తాగుతానని.. అందుకే కరోనా…