BJP MP Laxman: బీజేపీ మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంధంగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెయిడ్ సర్వేలతో ప్రజలను మోసం చేస్తోందని భాజపా ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.. ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు మాత్రమే ఇస్తుంది.. తాండూరులో మా మిత్రపక్షం జనసేన పోటీ చేస్తుంది.. మిత్ర పక్షంలో ఉన్న వారిని బీజేపీ గౌరవిస్తుంది.. సంస్థాగత మార్పులో భాగంగానే బండి సంజయ్ నీ మార్చడం జరిగింది..
రాజగోపాల్ రెడ్డికి పార్టీ జాతీయస్థాయిలో మంచి హోదాని కల్పించింది.. పార్టీ కార్యకర్తల కృషి, శ్రమతో మా కార్యకర్తలు రక్తాన్ని చిందిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అటువంటి బిజెపిపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదు.. జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి.. ఇలాంటి నిందలు వేయడం సరైంది కాదు అని లక్ష్మణ్ తెలిపారు.
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు.
డాక్టర్ వృత్తిలో ఉన్న కుటుంబం వృత్తిని వదులుకొని సేవ భావంతో బీజేపీలోకి రావడం సంతోషకరంగా ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలనలో అభివృద్ధిని చూసి దేశం గర్వ పడుతోంది అని ఆయన పేర్కొన్నారు.
రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు బీజేపీ పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు దశల వారీగా నిరసనలు ఉంటాయన్నారు.
MP Laxman: మోడీ ముచ్చటగా మూడో సారి పీఎం అవుతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులపై తండ్రి కొడుకుల స్పందన ఏది? అని ప్రశ్నించారు.
కేసీఆర్ అవినీతి, అప్రజాస్వామిక, నిజాం నియంతృత్వ పాలనపై తెలంగాణ ఉద్యమం స్థాయిలో మరో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా మూడో దశ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.