విజయవాడ కనక దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందని, వచ్చే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి పనులు చేపడుతాం అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం అని.. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్‌కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్‌కి 1500 కోట్లతో టెండర్లను…
విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. సిట్టింగ్‌ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న విశాఖలో భూ కేటాయింపుల విషయంలో తన సోదరుడు కేశినేని చిన్నిపై ఆరోపణలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు.. ఏపీలో కాక రేపుతోన్న లిక్కర్ కేసులోనూ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు కేశినేని నాని..
గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయకపోవడం దారుణం అని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.
ఇకపై విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడవనున్నాయి. గన్నవరం నుండి ముంబైకి విమాన సర్వీసును ఎంపీలు బాలశౌరి, ఎంపీలు కేశినేని చిన్ని ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లు గన్నవరం నుంచి ప్రారంభం అయ్యాయని ఎంపీ బాలశౌరి వెల్లడించారు.