TMC: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా, కీర్తి ఆజార్ మధ్య వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, బీజేపీ నేత అమిత్ మాల్వియా వీరి మధ్య గొడవల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పరిస్థితి విషమించడంతో తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
వక్ఫ్ బిల్లుకు సంబంధించి మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో జరిగిన ఘర్షణ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చర్యలు తీసుకున్నారు. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ టీఎంసీ ఎంపీని తదుపరి సమావేశం నుంచి సస్పెండ్ చేశారు.
పార్లమెంట్ భద్రతా లోపంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. భారీ గందరగోళం మధ్య మంగళవారం పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 78 ఏంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో 33 మంది లోక్‌సభ, 45 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. దీంతో పార్లమెంట్ వెలుపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Also Read: Police Restrictions: న్యూ…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి రాజకీయ వ్యూహాలు అందించి.. మరోసారి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి కీలకంగా పనిచేసిన న ఐ-ప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను టార్గెట్ చేస్తూ.. ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక రాజకీయ పార్టీని రాజకీయ పార్టీలాగే నడపాలని, రాజకీయ…